Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార హక్కు సామాన్యుల దరిచేరాలి : డీవైఎఫ్ఐ
నవతెలంగాణ-కారేపల్లి
వామపక్షాల పోరాటంతో వచ్చిన సమాచార హక్కు చట్టం సామాన్యుల దరి చేరేలా చైతన్యం తీసుకరావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కాలంగి హరికృష్ణ కోరారు. ఆదివారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి వచ్చిన ఆర్టీఐ కమీషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్‌నాయక్ ను డీవైఎఫ్ఐ, టీఎస్‌టీటీఎఫ్, టీఈఏ నాయకులు కలిశారు. ఈసందర్బంగా ఆయనకు సమాచార హక్కుపై వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆర్టీఐ కమీషనర్‌ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ రవీందర్‌నాయక్, ట్రైబల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ ప్రతాప్‌సింగ్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు అజ్మీర యుగేంధర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బాలకృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.