Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-చింతకాని
యాసంగిలో వరి కొనుగోలు చేయకపోతే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్కు రాజకీయంగా రైతులు ఉరి వేస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ ఆదివారం గాంధీనగర్ కాలనీ రామకృష్ణాపురం, బస్వాపురం, కొదుమూరు గ్రామాల్లో కొనసా గింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి, టిఆర్ఎస్ పాలకులు ఇక రాజకీయ డ్రామాలు ఆపాలన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పాలకులు తమ బాధ్యతను విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని గ్రామాల్లోకి వచ్చే బిజెపి, తెరాస నాయకులను వరి ధాన్యం కొనుగోలుపై నిలదీయాలని పిలుపునిచ్చారు. ధరలు ఎందుకు పెంచుతున్నారో, మళ్లీ వాళ్ళే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో జనాలే అడగాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పందిళ్ళపల్లి ఎంపిటిసి ఒర్సు వీరభద్రం, రామకష్ణాపురం మాజీ సర్పంచ్ తిరుపతి గోవిందరావు, సొసైటీ డైరెక్టర్ తూము కోటేశ్వరరావు, నాయకులు పెంట్యాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.