Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
సీపీఐ 14వ మండల మహాసభను దమ్మపేట మోడల్ కాలనిలో తంగెళ్ళమూడి శివకృష్ణ, యండమూరి రత్నకుమారి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్.కె షబ్బీర్ బాషా పాల్గొని మాట్లాడుతూ పార్టీ పేద ప్రజల కోసం పోరాటాలు చేసిందని ఎంతోమంది భూమిలేని నిరుపేదలకు భూములను పంచిందని, ఇల్ళు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిందని నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసేది సిపిఐ పార్టీ అన్నారు. మండలంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి పేద ప్రజల తరపున నిలబడిన పార్టీ ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత పార్టీకే దక్కుంతుందన్నారు. కేంద్రలో నరేంద్రమోడి, రాష్ట్రంలో కేసిఆర్ ప్రజలను విస్మరించి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతూన్నారని, రాబోయే కాలంలో వారికి తగిన బుద్ది చెబుతామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఎస్డి సలీం, నరాటి ప్రసాద్, యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల కార్యదర్శి పూర్ణచంద్రరావు , పండూరిబీరబాబు, కూకలకుంట సత్యనారాయణ, బెల్లం కృష్ణవేణి, ఏఎస్ఐఎస్ఎఫ్ కార్యదర్శి బత్తుల సాయి, ఏఐవైయఫ్ కార్యదర్శి సుంకుపాక ధర్మ, నల్లబోతుల నాగార్జున తదితరుల పాల్గొన్నారు.