Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్‌కంట్యాక్స్ రికవరీ కార్మికులకు తీవ్ర ఇబ్బంది
- మందా నర్సింహారావు
నవతెలంగాణ-మణుగూరు
భూపాలపల్లిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటనను ఖండిస్తున్నామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు అన్నారు. మంగళవారం ఓసీ 2 ఫిట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇన్‌కంటాక్స్ విషయంలో వారిని తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇన్కమ్ టాక్స్ మాపి చేపిస్తామని భూపాలపల్లిలో కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారన్నారు. ఇప్పటివరకు 8 బడ్జెట్లను పెట్టినా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఒక్కపైసా రాయితీ కల్పించకపోగా సీఎం పిఎఫ్ వడ్డీని ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి ఒక్కొక్క కార్మికుడు జీతాల నుండి ఇన్కమ్ టాక్స్ పేరుతో 3 లేదా 4 నెలల జీతాన్ని రికవరీ చేస్తుంటే కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇవేవీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని దీనిని కార్మికులు అర్థం చేసుకోవాలన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయటం లేదన్నారు. కార్మికులు తీవ్రంగా చేసిన 3 రోజుల సమ్మె, మార్చి 28, 29 రెండు రోజుల దేశ వ్యాప్త సమ్మె తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని బిజెపి ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. సింగరేణి వేలంపాటలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణి రూ.20 వేల కోట్లకు పైగా లూటీ చేసి సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేస్తున్నదని పేరుక్స్పై ఇన్కమ్ టాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఇప్పటివరకు రాయితీలు కల్పించడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను, సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కార్మికులు రాబోయే కాలంలో వీరికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన హెచ్చరించారు. 11వ వేతన ఒప్పంద చర్చల సందర్భంగా మూడు శాతం మాత్రమే పెరుగుదలను యాజమాన్యం ప్రకటించడాన్ని, ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేవలం ప్రతిపాదన చాలా దుర్మార్గమైన విషయం అని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి వెంకటరత్నం, బ్రాంచి నాయకులు లక్ష్మణ్ రావు, రాంమ్మూర్తి, ఈశ్వరరావు, రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, విల్సన్‌రాజు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.