Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి ఆవకాశం కోసం ఎదురుచూపులు
- మాజీకి టికెట్ కేటాయిస్తే ఓడిస్తామంటున్నా నియోజకవర్గ నాయకులు
నవతెలంగాణ-కొణిజర్ల
ఎమ్మెల్యే గా గెలిచి ఐదేళ్లు సేవ చేయాలని కన్న కలలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మొట్టమొదటిసారి సాకారం చేసుకున్నాడు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధిగా ఎన్నికై పేదప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కి ప్రభుత్వం నుంచి పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన మాజీ ప్రజాప్రతినిధి అ ఐదేళ్లు అభివృద్ధి పక్కన పెట్టి కక్ష సాధింపులకు తెరలేపి ఏకంగా అధికార పార్టీ నేతలపైనే తప్పుడు కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధిపై అగడాలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
నియోజకవర్గానికి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి ప్రధాన ఎంపీ అభ్యర్థి సహకారం, ఓ వామపక్ష పార్టీ మద్దతుతో ప్రజాప్రతినిధిగా గెలిచారు. ఆ తర్వాత కొద్దికాలానికే నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధిగా ఉన్న అతనితో విబేధించి అధికార పార్టీలో చేరారు. అనంతరం ఆ మాజీ ప్రజాప్రతినిధిని నాడు ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మండలంలోని ముఖ్యనాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులతోపాటు పలు ఆక్రమ కేసులు బానాయించడమేకాక ప్రతిపక్షాల పార్టీ నాయకులతో కలిసి వేధింపులకు గురిచేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ సమయంలో కొంతమంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకొని లొంగిపోయిన సంఘటనలు నియోజకవర్గంలో చోటుచేసుకున్నాయి. ఆ ఎన్నికల్లో అ ప్రాంతీయ పార్టీ అభ్యర్థికి ప్రధాన పోటీ అభ్యర్థిగా పోటీ చేసిన మరో ప్రాంతీయ పార్టీ అభ్యర్థి ఆస్తులపై రెవెన్యూ శాఖ అధికారులను తప్పుదోవ పట్టించి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఆస్తులను సైతం ధ్వంసం చేసిన చరిత్ర ఉంది. అ మాజీ ప్రజాప్రతినిధికి తన ప్రధాన అనుచరులను కూడా మానసికంగా ఆర్థికంగా దెబ్బతిసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. ఆవకాశం కోసం ఎదురుచూసిన నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసిన సదరు మాజీ ప్రజాప్రతినిధిపై ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా చేసారు. నియోజకవర్గ నాయకులు ఓటమి అనంతరం కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆ మాజీ ప్రజాప్రతినిధి ఇటీవలే కాలంలో నియోజకవర్గంలో తనకి అనుకూలంగా ఉన్న నాయకులను అడపాదడపా కలుస్తూ బైక్ ర్యాలీలు శుభకార్యాలు చావులు పరామర్శాలకు తిరుగుతూ ఈ దఫా అధికారు పార్టీ నుంచి నుంచి నాకేవస్తుందంటూ ప్రచారం చేస్తూ తన వర్గంలో ఉన్న నాయకులను ఉత్తేజపరుస్తూ హడావుడి చేస్తూ ఉనికి చాటుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే 2023 ఎన్నికల్లో అధికార పార్టీ లేదా మరో జాతీయ పార్టీ కానీ టికెట్ కేటాయించి మరోసారి ఆనేతకు ఆవకాశం ఇస్తేమాత్రం రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై క్షక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఖాయమని నియోజకవర్గంలోని నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నట్లు వినికిడి. అభివృద్ధి పక్కన పెట్టి కేసులు పెట్టి ఎలా లొంగదీసుకోవాలో అనే ఆలోచనలు చేస్తుంటాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ మాజీ ప్రజాప్రతినిధి హయాంలో పోలీసు స్టేషన్లలో ఉండే మండల స్థాయి అధికారులతో అదే విధంగా తన సామాజిక వర్గానికి చెందిన ఓ పెద్ద స్థాయి అధికారితో మిలాఖాత్ అయి తరచూ పోలీసు స్టేషన్ కి పిలిపించి ప్రత్యర్థులను స్టేషన్ లో ఉండే అధికారులతో బయపెట్టించడంలో సిద్ధహస్తుడని గుసగుసలు వినిపించాయి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఓ వామపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులకు నాయకులకు తాయిలాలు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులను తన సమక్షంలో పార్టీలో చేర్చుకోని సహకారం అనేపదానికి విలువ లేకుండా చేశారనే ఆరోపణలను సైతం ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఆ మాజీ ప్రజాప్రతినిధికి రాబోయే 2023 ఎన్నికల్లో ఏపార్టీ టికెట్ కేటాయించిన గత ఎన్నికల్లో జరిగిన విధంగానే పునరావృతం చేస్తామని నియోజకవర్గ ముఖ్య నాయకులు ముందుగానే బహిరంగాంగానే హెచ్చరిస్తున్నట్లు సమాచారం.