Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్
నవతెలంగాణ-భద్రాచలం
సీఐటీయూ ద్వారానే విశాల ప్రాతిపదికన కార్మికవర్గ ఐక్యత సాధ్యమని, అందుకోసం అన్ని స్థాయిల్లో సమస్యల ప్రాతిపదికన కార్మికుల ఐక్యత, సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేష్ పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులలో కార్మికోధ్యమ ఉద్యమ చరిత్ర సీఐటీయూ విశిష్టత అనే అంశాన్ని మంగళవారం ఆయన బోధించారు. కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఐక్యత, పోరాటం నినాదంతో సీఐటీయూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్మికవర్గ ఐక్యత కోసం సీఐటీయూని మరింత బలోపేతం చేయాలని, బలమైన సీఐటీయూ నిర్మాణం ద్వారా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి బలం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆయన విమర్శించారు. దేశం కోసం అనేక మంది త్యాగాలు చేశారని వారి అమరుల త్యాగాలను బీజేపీ ప్రభుత్వం విదేశీ పెట్టు బడి దారుల ముందు తాకట్టు పెడుతుందని విమర్శించారు. కార్మికులు పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించు కున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాలరస్తుందని విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవటం, కార్మిక హక్కుల రక్షణ కోసం, లేబర్ కోడలు రద్దు కోసం మే 1 నుంచి 7వ తేదీ వరకు వాడవాడలా మేడే వారోత్సవాలు జర పాలని పిలుపునిచ్చారు. మే డే ఉత్సవాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులలో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్మికులు, రాజకీయాలను, రాజకీయ పార్టీల వర్గ స్వభావాలను క్షుణంగా పరిశీలన చేయాలని రాష్ట్ర నాయకులు రమేష్ కుమార్ మక్కడ్ కోరారు. రాజకీయాలు, రాజకీయ పార్టీల విధానాలలోనే సమస్యలకు పరిష్కారాలువు న్నాయని అందుకు రాజకీయాలను అద్యయనం చేయాలన్నారు. రాజకీయ తరగతులకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యంవి.అప్పారావు అధ్యక్షత వహిం చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.బ్రహ్మా చారి, పద్మ, వెంకట రామారావు, శ్రీను, అర్జున్, వెంకటమ్మ, యం.రేణుక, యం.బీ.నర్సారెడ్డి, చిలకమ్మ, వీరన్న, చిలకమ్మ, కృష్ణ, సుశీల, రమణ, విజయశీల, మాధవి, నాగరాజు, శివప్రశాంత్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.