Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 ఏండ్ల కాలంలో గత ప్రభుత్వాలు దళితులకు చేసింది ఏమిలేదు
- దళితుల హక్కులను గౌరవించిందే కేసీఆర్
- దళిత బంధు లబ్దిదారులకు యూనిట్ల
- పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఈశ్వర్, అజరుకుమార్
నవతెలంగాణ-కొత్తగూడెం
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని, వ్వాపారస్తులుగా, వాహనాలకు ఓనర్లుగా మారారని, భవిష్యత్తులో పది మందికి ఉపాధి కల్పించే యజమానిగా దళితులు మారాలని, ఏమిచేయడం చేతకాని బీజేపీ, కాంగ్రెస్‌లు దళిత బంధు పథకం గురించి విమర్శించే హక్కు వారికి లేదని, దేశంలో బీజేపీ ప్రభుత్వం 8 ఏండ్లలో 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దళితులకు బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేదని, స్వాతత్య్రం వచ్చిన 75 ఏండ్ల కాలంలో గత ప్రభుత్వాలు దళితులకు చేసింది ఏమిలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫెర్ శాక మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రవాణా శాక మంత్రి పువ్వాడ అజరుకుమార్లు అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళిత బంధు పథకం లబ్దిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. స్థానిక ప్రకాశం స్టేడియంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు రాజకీయం కోసమో...ఓట్ల కోసమో తెచ్చింది కాదన్నారు. భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని చెప్పారు. దళిత బంధుపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత...కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేదని, చేతనైతే వారి పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఈ సారి మొత్తం 5500 మందికి లబ్ధి జరిగిందన్నారు. రానున్న విడతలో ఒక్కో నియోజకవర్గంకు 1500 చొప్పున ఉమ్మడి జిల్లాలో 15 వేల మందికి లబ్ధి చేకురనుందని తెలిపారు. దళిత బంధు యూనిట్లు పొదిన లబ్దిదారులు అంచెలంచలుగా ఎదిగి ఓనర్లుగా మారాలని, పదిమందికి ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. అనంతరం లబిద్దదారులకు చెక్కులు, యూనిట్లు, వాహనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య, వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం, ఆశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రామలు నాయక్, గ్రంధాలయ చైర్మెన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్యీ, కౌన్సిలర్ పల్లపు లక్ష్మణ్, కొత్వాల శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పోరేషన్ ఇడి ముత్యం తదితరులు పాల్గొన్నారు.