Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ఒక్క రోజు విద్యుత్ లేకపోవడంతో నీళ్ళు రాకపోవడంతో గ్రామస్తులు రోడ్డు మీదకు కాళీ బిందెలతో వచ్చి ధర్నా చేశారు. అబ్బుగూడెం గ్రామంలో నీళ్ళు లేవు అని పంచాయితీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామంలో కొట్టుడు బోర్లు వున్న వాటిని రిపేర్ చేయించడం లేదని ఆరోపించారు. హ్యాండ్ బోర్లు లో నీళ్ళు వున్న అవి పనిచేయక పోవడంతో గ్రామ చివర వున్న స్మశాన వాటిక దగ్గర నుండి తెచ్చుకుంటున్నామని కొందరు రాజకీయ నాయకులు అండదండలతో పంచాయితీ కార్యదర్శి గ్రామ ప్రజలు సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామంలోని కొందరు తో కలసి ప్రసాద్ అనే వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు నీళ్ళు కోసం ప్రజలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్న కూతవేటు దూరంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి సమస్య వినడానికి కూడా రాకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య గురించి తెలుసుకున్న స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ విజయ యం.డి.ఓ రేవతి వచ్చి నీటి సమస్య పరిష్కారం తీర్చేందుకు కృషి చేస్తామని వారికి సర్ది చెప్పడంతో వారు ధర్నా విరించుకున్నారు.
కరెంట్ లేకపోవడంతో నీటి సమస్య వచ్చింది : ఎండీవో
గాలి వానకి విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీటి సమస్య వచ్చింది. గ్రామంలో హ్యాండ్ బోర్లు వున్నాయి. అవి రిపేర్ లో వున్నాయి. పంచాయతీ తీర్మానం చేయించి నీటి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తాము.