Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రమాదేవి
నవతెలంగాణ-భద్రాచలం
ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు, అజీమ్ ప్రేమ్ జీ, ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ల ద్వారా రెండవ రోజు ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణా కార్యక్రమం ద్వారా పలురకాల అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని డీడీ ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవి అన్నారు. మంగళవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ భాష ఇండెక్స్ మెంట్ శిక్షణలో భాగంగా సంబంధిత ఉపాధ్యాయులను, గ్రూపుల వారీగా చేసి ఇంగ్లీష్ భాష సంబంధించిన వీడియో ప్రదర్శించారు. అనంతరం ఉపాధ్యాయులను గ్రూపుల వారిగా చేసి ఈ వీడియో ద్వారా తిలకించిన ఇంగ్లీష్ పదాలను ఉపాధ్యాయులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా ప్రసంగించారు. అనంతరం అజీమ్ ప్రేమ్ జి ఇన్స్ట్యూట్, సంబంధించిన ప్రొఫెసర్ పల్లవి, ఆ కార్డ్ సెల్ ఓఎస్డీ రామ్ లాల్ ఇంగ్లీషు భాష ప్రాముఖ్యాన్ని దానికి సంబంధించిన పదాలను ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎం రమణయ్య, జీసీడీఓ అలివేలు మంగతాయారు, అసిస్టెంట్ ఏసీఎంఓ బావ్ సింగ్, క్రీడల అధికారి డాక్టర్ వీరు నాయక్, వివిధ పాఠశాల నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ పాల్గొన్నారు.