Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో జూలూరుపాడు మండలానికి చెందిన దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు డైరీ ఫాం పెట్టుకున్న వారికి ట్రాక్టర్లును, చెక్కులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజరు కుమార్, విప్ రేగా కాంతారావు, ఎంఎల్ఎ లావుడియా రాములు నాయక్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా మంగళవారం అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, ఎంపీపీ లావుడియా సోనీ, జడ్పీటీసీ కళావతి, జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ నిర్మల, రామకృష్ణ, రాంబాబు, వేల్పుల నరిసింహారావు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.