Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
కుష్ఠు రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లెప్రసి విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు అన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర బృందం సందర్శించి, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలోని వ్యాధిగ్రస్తులను, రికార్డులు, రిపోర్ట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స చేయాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహణ ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దయానంద స్వామి, డాక్టర్ సంతోషి లత, ఎఎంఎంఓ శ్రీనివాస రెడ్డి, లోకేందర్, లూరదమ్మ, అరుణ, డీఎస్ఓ సురేందర్, జిల్లా లెప్రసి అధికారి డాక్టర్ శిరీష డాక్టర్ ప్రసాద్, డీపీఎంఓ, లక్పతి మోహన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నరేష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.