Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీవి పచ్చి అబద్దాలు, ఒక్కటి నిజం లేదు
- రేవంత్రెడ్డి నీతులు చెబితే ఎవరూ నమ్మరు
- మైనార్టీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్
- శవరాజకీయాలు మానుకోవాలి : మంత్రి అజరు
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కేవలం మతం పేరుతో పరిపాలన చేయడం దేశానికే ప్రమాదకరమని దురదృష్టకరమని మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో మతం పేరుతో పరిపాలన చేయలేదని అన్నారు. కేంద్రంలో 8 సంవత్సరాలలో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేసే ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేయకపోగా ప్రభుత్వరంగ సంస్థలన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ వ్యవస్థలను నాశనం చేస్తు మత విధ్వేశాలని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మినట్లయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఎమైపోవాలని అన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేవని పిల్లలంతా ఎమైపోవాలని ఆ జ్ఞానం వాళ్లకు లేదని కనీసం ఆ దృష్టికూడా లేదని ఈ రోజు కేవలం దేశాన్ని మతం పేరుతో ఒక ప్రభుత్వం పరిపాలన చేయడం దరదృష్టకరమని అన్నారు. ఎంతసేపు బిజేపి నాయకులు జైశ్రీరాం అంటూ మాట్లాడతారు కదా భద్రాచలం ప్రాంతం దక్షిణ అయోధ్యగా పిలువబడే శ్రీరాముడు నడయాడిన ప్రాంతం అయినా ఎందుకు ఈ ప్రాంత అభివృద్ధిమీద దృష్టి పెట్టలేదన్నారు. దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం జీర్ణించుకోలేక బీజేపీ ఫ్రభుత్వం అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో పది జిల్లాలో ఉన్నా దానిని 33 జిల్లాలు చేసి అభివృద్ధిని వేగవంతం చేసిన కేసిఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ఉన్నాయని కేసిఆర్ ఆలోచన రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణాకు ఒక్క కాలేజీ ఇవ్వకపోవడం బిజేపి నాయకులకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉధ్యమంలో ఉధ్యమకారులపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టీడీపీలో ఉండి తెలంగాణ పచ్చి వ్యతిరేకి అయిన చంద్రబాబు సంకలో చేరి ఇప్పుడు నీతులు చెబుతున్నారని అన్నారు. అనంతరం మంత్రి అజరుకుమార్ మాట్లాడుతూ రాజకీయంగా ఉమ్మడిఖమ్మం జిల్లా ఎంతో ప్రాధాన్యత ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి గుర్తింపు రావడానికి అనేక అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి చేపడుతున్నారని అందులో సీతరామ ప్రాజెక్టు జిల్లా కలెక్టరేట్, భద్రాద్రి పవర్ప్లాంట్, మెడికల్ కాలేజీలతో అభివృద్ధిలోకి దూసుకుపోతుందని అన్నారు. ఇలాంటి సందర్బంలో సందట్లో సడేమియా అన్న కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతూ యువత ప్రాణాలను తీస్తూ శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయ పరిణామాలు సహించమని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వైరా శాసన సభ్యులు రాములు నాయక్ గ్రంధాలయ సంస్థల చైర్మెన్ దిండిగాల రాజేందర్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.