Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ
- సీపీఐ మాజీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు
- పలు పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖలు, నాయకులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రజా పోరాటాలకు ఉద్యమ బిడ్డలను అందించిన సుశీలమ్మా నీకు వందనమమ్మా అంటూ శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రావుల పల్లి సోదరుల మాతృమూర్తి సుశీలమ్మ పార్ధివ మృతదేహాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు నాయకులు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. నర్సాపురం గ్రామానికి చెందిన భద్రాచలం డివిజన్ సీపీఐ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అమరజీవి రావులపల్లి నాగభూషణం సతీమణి అమరజీవి రావులపల్లి సుశీలమ్మ అమరజీవి నాగభూషణం గత ఆరు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు రావులపల్లి రాంప్రసాద్ సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా, చిన్నకుమారుడు రావులపల్లి రవికుమార్ సీపీఐ జిల్లా నాయకులుగా కొనసాగుతున్నారు. కాగా సుశీలమ్మ నర్సాపురం సర్పంచ్‌గా పని చేయడంతో పాటు తన ఇద్దరు కుమారులకు సైతం ఉద్యమ భావాలను నూరి పోసింది. సుశీలమ్మ మరణవార్త తెలుసుకున్న స్వయానా మేనల్లుడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, సీపీఐ మాజీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావులు నర్సాపురం గ్రామంలో గల సుశీలమ్మ పార్దివ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు సంతాపం తెలిపారు. వీరితో పాటు ఏపీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్ది తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లకీëనారాయణ, కొత్తగూడెం, పినపాక మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కార్యదర్శిలు పోటు ప్రసాద్, ఎస్కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోద్య, సిపిఐ మండల కార్యదర్శి కుంజా శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, తెల్లం వెంకట్రావు, సిపిఐ(ఎం) నాయకులు యలమంచి రవికుమార్, బాలనర్సారెడ్డి, గడ్డం స్వామి, బండారు శరత్, యలమంచి శ్రీనుబాబు, వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ జిల్లా అద్యక్షులు చింతిర్యాల రవికుమార్‌లతో పాటు, భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖలు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.