Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది సన్మాన గ్రహీత
నవతెలంగాణ-పాల్వంచ
(హెచ్-142) యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు శ్రమశక్తి అవార్డు అందుకోవడం అభినందనీయమని కేటీపీయస్ ఇంజనీర్స్ అసోసియేషన్స్, కార్మిక సంఘాల నాయకులు కొనియాడారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) కేటీపీయస్ 5,6,7 దశల ప్రాంతీయ కార్యవర్గం అధర్వర్యంలో ఆదివారం ఏ కాలనీలో యూనియన్ కార్యాలయం ఆవరణలో మేడే సందర్బంగా జిల్లా నుండి తెలంగాణ ప్రభుత్వం ద్వారా శ్రమశక్తి అవార్డు అందుకున్న రామారావును పలు ఇంజనీర్స్ అసోసియేషన్స్, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పాల్వంచ కేటీపీయస్ 7వ దశ నుంచి శ్రమశక్తి అవార్డు కోసం ఎంపికై అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉందని, ఈదే స్ఫూర్తితో ఇక ముందు కూడా ఇలాంటి అవార్డులు చాలా అందుకోవాలని, ఉద్యోగులందరినీ చైతన్యపరిచి విద్యుత్ ఉత్పత్తిలోనూ సహక రించాలని అభినందించారు. గతంలో రామారావు బాడ్మింటన్ క్రీడాలో జాతీయ స్థాయిలో పలు బహుమతులు విద్యుత్ సంస్థల నుండి అందుకోవటంతో కేటీపీయస్ పేరును జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని...పలువురు కొనియాడారు. రామారావు మాట్లాడుతూ... కార్మికులకు మరింత ఉత్సహంతో పనిచేసే బాధ్యత పెద్దలు తనపై ఉంచారని భావిస్తువాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా యూనియన్, కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ ఇంజనీర్స్ నాయకులు మంగీలాల్, బ్రాహ్మజీ, టీఎస్ఎస్పీఎఫ్ కమాం డెంట్ సి.జంగయ్య, కెమిస్ట్ అసోసి యేషన్ సిచ్.గిరిధర్, తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ సమీర్, 1104 యూనియన్ కంటే రాజేందర్, కోటేశ్వరరావు, 1535 నాయకులు ఏ.వెంకటేశ్వర్లు, ధనయ్య, 327 మాల్సూర్, వినాయకుడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకిరెడ్డి నరసింహారావు, ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్సుద్దీన్, యూసఫ్, బీసీ ఎంప్లా ుుస్ అసోసియేషన్ నాయకులు కొమరవెల్లి రవీందర్, ఐలయ్య, రాంబాబు (హెచ్-142) నాయకులు కె.అప్పారావు, రవి, శ్రీనివాసచారీ, నాగభూషణం, రవి, ఆర్టిజన్స్ రాంచందర్, లక్ష్మయ్య, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మణ్ నాయక్, బి.శ్రీనివాసరావులు తదితరులు రామారావును గజపూలమాల వేసి శాలవలతో సత్కారించి అభినందించారు.