Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు అన్నారు. ఆదివారం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ చేపడుతున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా మణుగూరులోని ఓసీ4లో ఫిట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ లాభాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి డబ్బును సొంతానికి వాడుకుంటోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.24 వేల కోట్ల ఇవ్వాల్సి ఉందని అన్నారు. సింగరేణిలో బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వారికి అప్పజెప్పడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నాయకులు వీరభద్రం, బ్రాంచ్ సెక్రటరీ, రామ్ గోపాల్, ఆఫీస్ బేరర్ గోపిశెట్టి శివయ్య, పిచ్ సీక్రెటరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.