Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవా భావమే ఉద్యమ కారుని లక్ష్యంగా సంజీవ్
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల గాలివానతో ఇల్లు కోల్పోయిన బాధితులకు సేవలాల్ సేన రాష్ట్ర వ్యవస్థాపకుడు భూక్య సంజీవ్ నాయక్ ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. మండల పరిధిలోని ఇర్యా తండా, తొమ్మిదో మైలు తండా, సాయన్న పేట, తంగేళ్ల తండా, గులారు తండాలో 2 రోజుల క్రితం గాలివాన బీభత్సంతో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు పరామర్శించి అనంతరం వారికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేయుట ఉద్యమకారుల లక్ష్యమని అన్నారు. నేనున్నా అంటు భరోసా ఇచ్చారు. కోక్యాతండాలో కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న కుటుంబాన్ని పరామర్శించారు. గత కొన్ని నెలల నుండి ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి, కామేపల్లి, ఇల్లందు, బయ్యారం, మండలాల్లోని అన్ని గ్రామాలలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి తనకు తోచినంత ఆర్థిక సహాయం అందజేయడం ఇల్లందు నియోజకవర్గ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. సంపాదనకు పాకులా డుతున్న ఈ రోజుల్లో ఈ ఉద్యమకారుడు సేవా దృక్పథంతో కుటుంబాలను పరామర్శించడం హర్షించదగినది అంటున్నారు. ఈ కార్యక్రమంలో భూక్య మోహన్, సురేందర్, జయరాం, హుస్సేన్ నాయక్, ప్రేమ్ చంద్, సోంలా, దేవా, మంగ్య, సుధాకర్, సురేష్, శంకర్, లక్ష్మణ్, శివ, సురేందర్, పంతుల్య, బాల, శోభన్, ఈరు, రమేష్, జయరాం, రాంజీ తదితరులు పాల్గొన్నారు.