Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
- న్యాయవాది పాయం రవివర్మ
నవతెలంగాణ-భద్రాచలం
డంపింగ్ యార్డ్ 207 సర్వే నెంబర్కు మార్చాలని కోరుతూ ఐటీడీఏ ఎదుట కొనసాగుతున్న గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా ప్రముఖ న్యాయవాది పాయం రవివర్మ మాట్లాడుతూ ఆదివాసుల జనావాసాల మధ్య ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఆదివాసుల మనోభావాలకు వ్యతిరేకంగా డంపింగ్ యాడ్ ప్రతిపాదన తెచ్చిందని ఆయన అన్నారు. ఆ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభ సంప్రదించకుండా అధికారులు చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ప్రజా పోరాటాలతో న్యాయపోరాటం చేయాలని ఆయన అన్నారు. వలసవాదుల అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నాలుగో రోజు దీక్షలో ఎం.రమ, పాయం వెంకటలక్ష్మి, కారం పద్మ, పాయం మంగ, వేణి, భద్రమ్మ, పాయం పార్వతి, వసుంధర, మడవి చిన్నక్క, కల్లూర్ దుర్గ, జనార్ధన్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.