Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ పింగళి నాగరాజు
నవతెలంగాణ-భద్రాచలం
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకూ పట్టుదలతో సాధన చేయాలని సీఐ పింగళి నాగరాజు అన్నారు. భద్రాచలం శాఖ గ్రంథాలయంలో వసుధ ఫౌండేషన్ వారి సహకారం రూ.15 వేల విలువగల స్టడీ చైర్లు వసుధ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రాజు, భద్రాచలం సీఐ చేతుల మీదుగా గ్రంధాలయ చైర్మన్ పాలకులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిరుద్యోగులు ముఖ్యంగా రోజుకు రెండు వందల ప్రశ్న జవాబులు చదివి వాటిని గుర్తుండే విధంగా వారానికి ఒకసారి మాక్ టెస్ట్ పెట్టుకోవాలని ఆయన అన్నారు. నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి వారు చదువుకున్న సారాంశాన్ని చర్చించు కోవాలని, రోజువారీ న్యూస్పేపర్ చదవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో వసుధ ఫౌండేషన్ చేసే సేవలను ఆయన కొని యాడారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు, గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు, గ్రంథాలయ పాలకులు జానీ, గ్రంథాలయ డైరెక్టర్ శంకర్రావు, జి.వి.బి.చారి, బషీర్, మూర్తి, పి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.