Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లో రాసి సీడ్స్ కార్పొరేట్ కార్యాలయం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రాసి సీడ్స్ చైర్మన్ డాక్టర్ రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై మంత్రి కె.ఎన్ నెహ్రూ, తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ ఆర్కే పన్నీర్ సెల్వం, తమిళనాడు ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కోఆపరేషన్ మార్కెటింగ్ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బేయర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, డిసిసిబి డైరెక్టర్ రామబ్రహ్మం పాల్గొన్నారు.