Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిత హారం కోసమే మొక్కలు పెంపకం
- అటవీశాఖ మంత్రి ఇంద్రకరుణ్ రెడ్డి
నవతెలంగాణ-అశ్వారావుపేట
అడవులను విస్తరించడం ద్వారా హరిత హారం పెంపు దలే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరుణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించిన అనంతరం విలేకరులతో....రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పచ్చని మొక్కలను పంపిణీ చేసేందుకు అవసరమైన మొక్కలను ప్రభుత్వం రాష్ట్రంలోని 12750 నర్సరీలలో పెంచటం జరుగుతున్నదని వీటిని వచ్చే హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో పంపిణీ చేయటం జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఇంతకు ముందు 25 శాతంగా ఉన్న అడవులను ప్రస్తుతం 4.17 శాతం అదనంగా విస్తరింపజేయటం జరిగిందని, 33 శాతం అడవులను విస్తరింపజేయటమే ప్రభుత్వ ''లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో నాటిన మొక్కలలో 75 శాతం మొక్కలను బతికించుకోవాలని అందుకు గ్రామాలలోని సర్పంచ్, కార్యదర్శులదే ముఖ్యపాత్ర అన్నారు. అందుకు ఇతర ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలు సర్పంచ్‌లకు అందించాల్సి ఉందన్నారు.
ఈ ప్రాంత పరిసరాలు ఎటుచూసినా పచ్చదనమే..
అశ్వారావుపేట నియోజకవర్గం పరిసర ప్రాంతాలు ఎటుచూసినా పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయని ఈ ప్రాంతంలో భూగర్భజలం విరివిగా ఉండటంతో ఉద్యాన పంటలకు హబ్ మారిందని అటవీశాఖ మంత్రి ఇంద్రకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించిన ఆయన ఇక్కటి వాతావరణ పరిస్థితి, పచ్చని పంటపొలాలను చూసి మైమర్చిపోయారు. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు పామాయిల్ పంటపై చూపుతున్న మక్కువ, దిగుబడి, ఆదాయం చూసి తెలంగాణ ప్రభుత్వం పామాయిల్ సాగు రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. పామాయిల్ సాగుతో ఆశించిన దిగుబడులు, లాభాలను రైతులు గడిస్తున్నారని ఈ పంటద్వారా ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రధానంగా కోతులు, అడవి పందుల బెడదకాని దొంగల భయంకాని లేవని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ భీమా నాయక్, డీఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఎఫ్ఓ తిరుమలరావ్, అశ్వారావుపేట, దమ్మపేట ఎఫ్ఆర్ఓలు అబ్దుల్ రహ్మాన్, శ్రీనివాస్ ఉద్యాన, పట్టుపరిశ్రమ జిల్లా అధికారి జినుగు మరియన్న, ఆయిల్ ఫెడ్ డీఓ ఉదరు కుమార్, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల మేనేజర్ ఆకుల బాలకృష్ణ, కళ్యాణ్, నిర్మల్ డిహెచ్ఎస్ఓఓ శ్యామ్‌రావ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.