Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరణ్ 3వ వర్ధంతి సభలో దొడ్డ రవి కుమార్
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ రంగంలో ఐక్య ఉద్యమాలు నేత కామ్రేడ్ కిరణ్ అని సీఐటీయూ, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్ అన్నారు. శనివారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ టీఎస్ (సీఐటీయూ) కేటీపీఎస్ కార్యాలయంలో రాష్ట్ర మాజీ జనరల్ సెక్రటేరి కి.శే ఎన్.కిరణ్ 3వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఐ(ఎం), సీఐటీయూ పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్ హాజరై కిరణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ 5వ, 6వ కార్యదర్శి తోట త్రినాధ్ అధ్యక్షత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో కార్మికుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం నిర్వహించాలని అన్నారు. వారి స్ఫూర్తితో రానున్న రోజుల్లో విద్యుత్ కార్మికుల హక్కుల కోసం టీఎస్ యుఈఈయు సీఐటీయూ కార్మికుల పక్షణా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సహాయక కార్యదర్శి అంకిరెడ్డి నరసింహారావు, 5వ, 6వ అధ్యక్షలు పి.వెంకటేశ్వర్లు, నాయకులు డి.సత్యం, బి.కన్నయ్య, ఎన్.రాజు, టి.వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీను, వై.సత్య నారాయణ, సంతోష్ రెడ్డి, బి.క్రాంతి, షేక్ అక్రమ్, చిన్నికృష్ణ పాల్గొన్నారు.