Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్
- టీఆర్‌వీకేఎస్‌లో భారీ చేరికలు
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకెఎస్) ద్వారానే ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆ యూనియన్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శి చారు గుండ్ల రమేష్ అన్నారు. మంగళవారం జెన్కో కాలనీలోని యూనియన్ కార్యాలయంలో కేటీపీఎస్ 5, 6 దశల అత్యవసర సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 15 మంది ఆర్టిజన్ కార్మిక సోదర, సోదరీమణులు వివిధ కార్మిక సంఘాలకు రాజీనామా చేసి టీఆర్వికెఎస్లో చేరారు. వీరందరికీ యూనియన్ కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వా నించారు. టీ.కృష్ణమూర్తి, పి.సదానందం ఫరీద్, ఎం.డి గౌస్, యం.డి.యాకూబ్, బాలు, శేషగి రిరావు, కుమార్, నగేష్ తదితరులు చేరినారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ పీఆర్సీకమిటీ నియామకం కోసం రాష్ట్ర కార్యవర్గం తీవ్రముగా ప్రయత్నం చేస్తున్నదని అతి త్వరలో కమిటీని నియామకం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ ముత్యాల రాంబాబు కేటీపీఎస్ 5,6 దశల రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రవికుమార్, రమేష్, ఆర్టిజన్ నాయకులు వెంకట్రావు, ప్రభాకర్, నారాయణ, రవి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.