Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఏర్పాడ్డాకా 20 వేల మంది కార్మికులు తగ్గారు
- కార్మిక సంఘాలు కార్మికుల పక్షాణ పోరాడాలి
- ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును ప్రశ్నిస్తే మెడలు పట్టి బైటికి పంపిస్తారని, ఏది చెప్పితే అది చేస్తే సింగరేణి చైర్మెన్లా ఆదేసీట్లో ఉండొచ్చని, సింగరేణి సంస్థను దివాలా తీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 63 వేల కార్మికులతో ఉన్న సింగరేణి, రాష్ట్రం ఏర్పాడ్డాకా 20 వేల మంది కార్మికులు తగ్గారని, నేడు 43వేల మంది కార్మికులు ఉన్నారని, పేరు సింగరేణి తల్లి...కానీ, రక్తం చిందించి బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికుల పక్షాన పనిచేయని యాజమాన్యం ఉందని, అధికారులు అనుభవిస్తున్న దర్జా అంతా కార్మికుల చెమట, నెత్తురేనని, ఇప్పటికైనా సింగరేణిలోని కార్మిక సంఘాలు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కార్మిక చైతన్య యాత్ర కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జరిగిన బహిరంగ సభతో ముగిసింది. ముగింపు సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సింగరేణి చైర్మన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చెబితే అది చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఏడేండ్లుగా ఉన్నారన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ఈసడించు కుంటున్నారని విమర్శించారు. ఆయన టీవీలో మాట్లాడుతుంటే టీవీలు కట్టేస్తున్నారని ఎద్దేవాచేశారు.
జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు నమ్మటం లేదని హుజురాబాద్ నియోజకవర్గం శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతూ వారి భూములు లాక్కుంటూ వారి భూముల్లో బోర్లు గానీ ఎటువంటి వ్యవసాయం చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములను పరిష్కారం చేస్తానని చెప్పి నేటికి పరిష్కారం చేయలేదని విమర్శించారు. గిరిజనులకు రావలసిన 9శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్రం కార్యదర్శి చిలుకూరి రమేష్, జిల్లా కోశాధికారి నున్న రమేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.