Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రం ప్రభుత్వం రోజురోజుకు పెంచుతున్న గ్యాస్ ధరలతో మధ్యతరగతి మహిళలు అనేక ఇబ్బందు పడుతున్నారని ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూరి లక్ష్మీ అన్నారు. మంగళవారం ఐద్వా మున్సిపల్ పరిధిలోని గాజుల బస్తీలో మహిళా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గ్యాస్ రేట్లు కేంద్ర బిజేపి ప్రభుత్వం రోజురోజుకిఈ పెంచుతూ ఉండటంవల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ.450 ఉన్న గ్యాస్ సబ్సిడీ కూడా కొంత వచ్చేది, ఇప్పుడు రూ.1100 గ్యాస్ చేసి సాధారణ ప్రజలకు గ్యాస్ వాడేది లేకుండా చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాలు ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు మణి, దేవి, విజయ, సుప్రియ, జయ తదితరులు పాల్గొన్నారు.