Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ, ఎమ్మెల్యే పర్యటనలో బహిర్గతం
నవతెలంగాణ-ములకలపల్లి
మండలంలోని టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటినుండో నివురుగప్పిన నిప్పులా ఉంటూ వస్తున్న వర్గపోరు మంగళవారం ఇక్కసారిగా బగ్గుమంది. ఎంపీ నామానాగేశ్వరావు, ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య లు మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న లుకలుకలు వెలుగుచూశాయి. స్థానిక రైతువేదిక ప్రారంభోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ల ప్రసంగాలు ముగిసిన అనంతరం స్థానిక మండల అద్యక్షుడు మోరంపూడి అప్పారావు భూకబ్జాలను ప్రోత్సహిస్తూ అమాయక గిరిజనులను రెచ్చగొడుతూ తన భూమి పైకి ఎగదోలుతూ తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ అదే పార్టీకి చెందిన సీనియర్ ఉద్యమ నాయకుడు మహ్మద్ షపీ ఉద్వేగానికి లోనవుతూ మైకులో ఎంపీ, ఎమ్మెల్యేలను వేడుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తాను ఉద్యమ కాలం నుండి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నానని, గడిచిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడి ఎంపిక సందర్భంలో తాను ఆయనకు వ్యతిరేకంగా పనిచేసానన్న ఆక్రోశంతో తనపై కక్ష పెంచుకున్న టీఆర్ఎస్ మండల అద్యక్షుడు అప్పారావు తనపై కక్ష సాధింపులకు పాల్పడుతూ, అమాయక గిరిజనులకు రెచ్చగొడుతూ టీఆర్ఎస్ ఏతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు నాయకులతో కలిసి, స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలు సృస్టించి కోర్టును తప్పు దోవ పట్టిస్తూ తన భూమిని కబ్జా చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారని, తనను తన కుటుంబాన్ని కాపాడాలంటూ ఎంపీ, ఎమ్మెల్యేల సాక్షీగా బహిరంగా మైకులో షపీ వేడుకొంటూ అర్ధించడం అక్కడ ఉన్నవారిని సైతం కదిలించేలా ఉంది. తాను క్రమ శిక్షణ గల కార్యకర్తగా ఉద్యమ కాలం నుండి టీఆఆర్ఎస్ జెండా భుజాన మోసానని, నాకు న్యాయం చేయకపోతే మండల అద్యక్షుడి వేధింపుల విషయం తాను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు.