Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి
- కలెక్టర్ అనుదీప్ యువతకు పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కలెక్టర్ అనుదీప్ యువతకు పిలుపు నిచ్చారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో నిర్వహిస్తున్న ఉచిత స్టడీ సర్కిల్లో పాల్గొని విద్యార్థులకు ఉద్యోగ సాధనకు సన్నద్ధత, మెటీరియల్ తదితర సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపధ్యంలో సక్సెస్ సాధించడానికి ప్రణాళిక చాలా ముఖ్యమని చెప్పారు. సిలబస్ దిక్సూచిగా పనిచేస్తుందని మంచి మెటీరియల్స్‌ను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. నిరంతరం ఒకటే సబ్జెక్టు సాధన చేయడం వల్ల ఉప యోగం ఉండదని, అన్ని సబ్జెక్టులపై సమగ్రమైన అవగా హన కలిగి ఉండాలని చెప్పారు. ఎన్ని గంటలు చదివా మన్నది ముఖ్యం కాదని, ఎంత ఫోకస్ చదివామన్నదే ముఖ్యమని చెప్పారు. మైండ్‌లో ఇతర సమస్యలకు తావు ఇవ్వొద్దన్నారు. రివిజన్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అపో హలు వీడి సిలబస్ ప్రకారం సన్నద్ధం కావాలన్నారు. విజ యం సాధించుటలో కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగ పడతాయని, ప్రతి రోజు దిన పత్రికలు చదవి ముఖ్యమైన అంశాలను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఎస్సీ అభి వృద్ధి అధికారి డి.అనసూయ, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శివభాస్కర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సిబ్బంది వెంకటేశ్వర్లు, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.