Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం ఎంపీ నామా
నవతెలంగాణ-ములకలపల్లి
రైతు ప్రీతిపాత్రుడు సీఎం కేసీఆర్ అని 2014 తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పించి బడ్జెట్లో నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత ములకలపల్లిలోని రైతువేదిక ఆవరణలో మొక్కను నాటి రైతువేదికను ప్రారంభించారు. అనంతరం ములకలపల్లి నుంచి మొగరాలగుప్ప వరకు పీఎంజీఎస్ కింద రూ.1.88కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి అదే రహదారిపై గొల్లగూడెం శివారులో పాములేరు వాగుపై పీఎంజీఎస్‌వై నిధులు రూ.3.54కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెనకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత రైతువేదిక ఆవరణలో స్థానిక ఎంపీపీ మట్ల నాగమణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో తెలంగాణలో తప్ప ప్రతి రాష్ట్రంలో కరెంటు కోతలు విధిస్తున్నారని, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు గృహవినియోగానికి నిరంతరాయంగా విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం అమలుకావడంలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో తాను ఎంపీగా పనిచేస్తున్న రోజుల్లో మండలాలకు వెళితే అడుగడుగునా ఖాళీబిందెలతో మహిళలు తాగునీటి కోసం ధర్నాలు చేపడుతూ ఎదురొచ్చేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సీతారామ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా కృష్ణా, గోదావరి జలాలను నేరుగా గ్రామాలకు పుష్కలంగా అందుతున్నాయని, దీంతో సాగు, తాగునీటి కష్టాలు తీరాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన దగ్గరి నుంచి ఒక్క ములకలపల్లి మండలానికే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుసంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలతో పాటు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ గతంలో రైతులు తమ సమస్యల గురించి చర్చించుకోవాలన్నా, మండల కేంద్రానికి వచ్చి అధికారుల కోసం ఎదురుచూడాలన్నా రోడ్లవెంబడి, చెట్ల కింద నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కోసం 5వేల మంది రైతులకు ఉపయోగపడేవిధంగా రైతువేదికను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, నేడు రైతులు దర్జాగా ఆ రైతువేదికల్లో తమ సమావేశాలు నిర్వహించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అభిమన్యుడు, అశ్వారావుపేట ఏడీఏ అఫ్టలేగం, పీఆర్ ఈఈ సీతారాములు, ఎంపీడీవో నాగేశ్వరరావు, తహశీల్దార్ వీరభద్రం, ఎంపీవో లక్ష్మయ్య, సర్పంచ్‌లు బీబినేని భద్రం, గొల్ల పెంటయ్య, బైట్ రాజేష్, కారం సుధీర్, వాడే నాగరాజు, సున్నం సుధాకర్, సున్నం సుశీల, ఎంపీటీసీలు శెనగపాటి మహరామణి, తాటి తులసి, కొర్రి వీరభద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.