Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలో మొండివర్రె గ్రామంలో బీటీ రోడ్డు వెంటనే మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యుడు నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మొండి వర్రె గ్రామంలో జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా ఆదివాసీ గిరిజనులు ఈ గ్రామంలో నివసిస్తున్నారని, గ్రామ ప్రజలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని గిరిజన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వర్షా కాలంలో వర్షపు నీరు ఇండ్లలో చోరబడి ఇండ్లు బురద మాయంగా మారుతున్నాయని తెలిపారు. ఈ బురద నీటి వల్ల గ్రామ ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే మొండివర్రె గ్రామాన్ని సందర్శించి తక్షణమే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీలకు మండల అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారని అయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బొర్రా జోగయ్య, సున్నం రాజులు, కురసం రాజులు, గడ్డం పుల్లయ్య, కురసం సతీష్, బోర్రా భారతీ, బోర్రా గణేష్ , సున్నం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.