Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్
నవతెలంగాణ-పాల్వంచ
చదువుకున్న ప్రతి ఒక్కరూ స్వశక్తి పై నిలబడి వ్యాపారరంగంలో స్థిరపడాలని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ అన్నారు. మంగళవారం పాల్వంచలోని కాలనీలో ఉన్న నూతన యారో ఎంటర్ప్రైజెస్ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత్రి తాళ్లూరి నాగలక్ష్మిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని, ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్న ఈ రోజుల్లో యువ దంపతులు నాగలక్ష్మి-హరిబాబులను ఆదర్శంగా తీసుకుని, చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ స్వశక్తి పై నిలబడి వ్యాపారరంగంలో స్థిరపడాలి అనే అభినందించారు. వ్యాపార రంగాల్లో పురుషులే కాదు మహిళలు కూడా ముందుండాలని కోరారు. బహుజనులు అంతా ఏకమై బహుజన రాజ్యాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తరిమికొటతామని, కొందరి తెలంగాణ కాదు-అందరి తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని, రానున్న ఎన్నికల్లో బిఎస్పి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. యారో ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత్రి తాళ్లూరి నాగలక్ష్మి, డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్రకు తమ వంతు విరాళం రూ.20,000 చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్, బామ్ సేఫ్ రాష్ట్ర నాయకులు దుర్గయ్య, స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరయ్య, సాయి, పూర్ణ, దండోరా శ్రీను, విజరు తదితరులు పాల్గొన్నారు.