Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్ స్టేషన్లను ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో రూ. 2కోట్లు, రాపర్తి నగర్లో రూ.2కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్లను మంత్రి పువ్వాడ అజరు కుమార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో విద్యుత్ లో-ఓల్టేజ్ సమస్యను పూర్తిగా అధిగమించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న 60 డివిజన్ల పరిధిలో పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో పటిష్ట ప్రణాళికతో ఉందన్నారు. టేకులపల్లిలో ఇటీవలే ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్మించిన 2వేల డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్వాసితులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి దానికి అనుసంధానంగా ఖానాపురం, టేకులపల్లి, చైతన్య నగర్, వైఎస్సార్ కాలనీ, వెలుగుమట్ల, గోపాలపురం ప్రాంత ప్రజలను నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి , చైర్మన్ విజరు కుమార్, మేయర్ నీరజ, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం, నాయకులు ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.