Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21ఫిట్ క్వార్టర్స్ పరిరక్షణ కమిటీ డిమాండ్
ఇల్లందు: నూతనంగా ప్రారంభించబోతున్న పూస పళ్లి ఓసి ప్రాంతంలో భూసేకరణ ద్వారా నిర్వాసిత ప్రాంతాలు అవుతున్న 21 ఫిట్ ఏరియాలోని విజయలక్ష్మి, నగర్ తిలక్ నగర్ గ్రామపంచాయతీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని ''21పిట్ క్వార్టర్స్ పరిరక్షణ కమిటీ'' సింగరేణని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన సమావేశంలో పరిరక్షణ కమిటీ నాయకులు అబ్దుల్ నబీ మాట్లాడుతూ సింగరేణి తీయబోయే నూతన ఓపెన్ కాస్ట్ వల్ల నిర్వాసిత ప్రాంతాలుగ మారుతున్న 21పిట్ ఏరియాలోని ప్రజానీకం సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓసి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.4.6 కోట్ల సీఎస్ఆర్ నిధులలో అధికంగా భూమి కోల్పోతున్న ఈ ప్రాంతానికి కేవలం రూ.20 లక్షలు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ఓసి ప్రభావిత ప్రాంతం మొత్తం విజయలక్ష్మీ నగర్, తిలక్ నగర్ గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉన్నదని కావున ఈ రెండు గ్రామ పంచాయతీలకు రోడ్లు, సైడు కాలువలు, మరుగుదొడ్ల పైప్ లైన్ మార్పు, మినరల్ వాటర్ ప్లాంట్లు, సులబ్ కాంప్లెక్స్‌లు, పాఠశాల, క్రీడా మైదానం అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ నాయకులు నబి, రమేష్, క్లింట్ రోచ్, రెంటాల సదానందం, తెప్పల శ్రీనివాస్, సింగారపు శ్రీనివాస్, పాల్గొన్నారు.