Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు పరీక్ష సమయంలో ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముదిగొండలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు మండలంలోని మారుమూల గ్రామాల నుంచి అనేక వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారని, ఒక్క నిమిషం నిబంధన వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే ఒక్క నిమిషం నిబంధన ఎత్తివేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరగంట సమయాన్ని ఇంటర్ పరీక్షలకు విద్యార్థులకు ఆప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు అరగంట సమయాన్ని కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బి.వెంకట్, బి.సాయి, రాము, డి.వినరు, కె.రోహిత్, చందు, కార్తీక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.