Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - వైరా టౌన్
ప్రజలను కదిలించి ప్రజా ఉద్యమాలను ఉదృతంగా చేయాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం వైరా బోడేపూడి భవనం నందు వ్యవసాయ కార్మిక సంఘం వైరా మండల అధ్యక్షులు బాజోజు రమణ అధ్యక్షతన ప్రజా సంఘాల మండల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానికంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను సర్వే చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలను కదిలించి ప్రజా పోరాటాలను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వనమా చిన్న సత్యనారాయణ, సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తూము సుధాకర్, రైతు సంఘం మండల అధ్యక్షులు మేడా శరాబంధి, మహిళా సంఘం మండల కార్యదర్శి షైనాబి, డివైఎఫ్ఐ మండల నాయకులు బి.నాగబాబు తదితరులు పాల్గొన్నారు.