Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 167 పాఠశాలలకు పరిపాలన అనుమతులు
- జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
మన ఊరు, మన బస్తీ-మనబడిలో ఎంపిక చేసిన పాఠశాలలను ప్రక్షాళన చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుండి విద్యా, పర్యవేక్షక ఇంజనీరింగ్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో మన వూరు, మనబస్తీ-మనబడి పాఠశాలపై టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 368 పాఠశాలలను ఎంపిక చేశామని, ఇప్పటి వరకు 167 పాఠశాలలకు పరిపాలన అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. మరమ్మత్తులు చేపట్టనున్న పాఠశాలలకు సంబంధించి తప్పని సరిగా బుక్ లెట్స్ తయారు చేయాలని చెప్పారు. పిల్లలు చదువుకోవడానికి అనువుగా పాఠశాలలను తయారు చేయాల్సిన అవసరం ఉన్నదని, అపుడే కార్యక్రమం యొక్క లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఉపాధిహామి పథకం ద్వారా చేపట్టనున్న పనులకు తక్షణమే బడ్జెట్ ఎస్టిమేషన్స్ జనరేట్ చేయాలని తెలిపారు. ఈ నెలాఖరు వరకు అన్ని పాఠశాలలను అన్ని హంగులతో సిద్ధం చేయాలని జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఈఓ సోమసోఖరశర్మ, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, యంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ విద్యాశాఖ అధికారులకు ఆదేశం
ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరుగకుండా10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఈ నెల 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు రావొద్దని చెప్పారు. ఇన్విజిలేటర్లు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. విద్యార్థులు 1 గంట ముందు నుండే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య చికిత్సా కేంద్రాలు ఏర్పాటుతో పాటు ఒఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. 13419 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 74. కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా రెవిన్యూ సిబ్బందిని కేటాయించాలని చెప్పారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లుకు పరీక్షా కేంద్రంలో సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలు, కాలుక్యులేటర్లు వంటి వస్తువులను అనుమతించరని చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని చెప్పారు. జిరాక్సు కేంద్రాలను మూసేయ్యాలని చెప్పారు. సహాయత కొరకు డిఈఓ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్సు సెల్ నెం. 9010191438 కు గానీ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08744-241950 కంట్రోల్ రూము నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఈఓ సోమశేఖరశర్మ, అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, మిషన్ బగీరథ ఈఈ తిరుమలేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానందస్వామి, డిఆర్డీ అశోకచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.