Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
అభయ హస్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి డిమాండ్ చేశారు. గురువారం ఐద్వా కొత్తగూడెం పట్టణ కమిటీ సమావేశం రామా టాకీస్ ఏరియా మంచికంటి భవన్లో టౌన్ అధ్యక్షురాలు అప్పికట్ల జయశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి, ఎస్.లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐద్వా సర్వేలు నిర్వహించిందని ఆ సర్వేలో భాగంగా కొత్తగూడం టౌన్లో అన్ని వార్డులలో మహిళా సమస్యలపై సర్వే నిర్వహించి అనేక రకాల సమస్యలు వెలుగులోకి వచ్చాయని వాటిలో ముఖ్యంగా ద్వాక్రా గ్రూప్ రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని అవి అధిక వడ్డీలు కట్టించుకుంటున్నారని, గతంలో కట్టిన అభయ హస్తం డబ్బులు తిరిగి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని, మహిళలు వాపోయారు. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు రుణాలు రద్దు చేసినట్లుగా తెలంగాణలో కూడా మాఫీ చేస్తే బాగుండేదని, పనులు లేక నిత్యవసర సరుకులు రేట్లు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ కమిటీ సభ్యులు సువర్ణ, జయలక్ష్మి, జ్యోతి, రాజ్యలక్ష్మి, విజయ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.