Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేస్తున్నారని, ఆ చట్టాల రక్షణకు పోరు ఉధృతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్ కార్మికులకు పిలుపునిచ్చారు. గ్రానైట్ పరిశ్రమ కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రానైట్ లోడింగ్, అన్ లోడింగ్, హమాలి, ఆటో, వెల్డింగ్, భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో కునారిల్లుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరంచేసి కార్మికులకు ప్రధానమంత్రి మోడీ ఉపాధి లేకుండా చేస్తున్నాడని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై అసంఘటిత కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. అనంతరం కార్మిక సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ టి శ్రీనివాస్‌కు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇరుకు నాగేశ్వరరావు, బంక ఉపేందర్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రమేష్, రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.