Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ, టిపిఎస్కే ఆధ్వర్యంలో వేసవి ఆటవిడుపు
- నేడు డీఈవో, అసిస్టెంట్ కమిషనర్ హాజరు
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపులు శుక్రవారంతో ముగియనున్నాయి. ఈ నెల 5వ తేదీన ప్రారంభం అయ్యాయి. ఈ వేసవి శిబిరం ఉదయం 8.30 నుండి 11.30గంటల వరకు నిర్వహించారు. ఇందులో 4, 5, 6, 7 తరగతులు చదివే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ ఖమ్మంలోని నిర్మల్ హృదరు హైస్కూల్ లో జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించారు. ఈ క్యాంపులు ఫన్ మ్యాథ్స్, చిన్న పిల్లలకు విజ్ఞాన ఆటలు ప్రతిరోజు ఉదయం ప్రారంభంలో అభ్యుదయ, దేశ భక్తి, చదువు, విజ్ఞానం, మత సామరస్య గీతాలు వంటి వారిని ప్రజా నాట్య మండలి సెక్రటరీ సదానందం, దేవి, గోవింద్ నేర్పారు. పారుపల్లి పద్మ, చంద్రయ్య, చిన్న పిల్లలకు మమత, భారతి, ఉమాదేవి, ఝాన్సీ సరదా సరదా ఆటలు ఆడించారు. విజ్ఞానం వినోదం, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మ్యాజిక్ నేర్పారు. ఓరిగామి పేపర్, మడతలతో బొమ్మలు, టోపీ, కుర్చీ, ఫ్లవర్, ట్యాంక్, బోట్యిలా నేర్చుకున్నారు. డ్రాయింగ్ పిల్లలతో వేయించారు. ఇందులో నాగేంద్ర నాయకత్వంలో అప్పారావు, పురుషోత్తం, ఏసోబు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని కవి రచయిత అట్లూరి వెంకట రమణ, మల్లెంపాటి వీరభద్ర రావు ప్రారంభించారు. అంతేకాక వాటితో మారె రంగుల ద్వారా గ్రీటింగ్ కార్డ్స్ తయారీ చేశారు. వాటర్ ఫౌంటైన్, కాంతి రుజు మార్గంలో ప్రయాణం చేయటం, ధ్వని తరంగాలు నుండి టెలిఫోన్ ఎలా తయారయ్యాయో చూపించారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లిశ్వరి, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ హదరు పాఠశాల అధినేత సాంబశివరెడ్డి, ప్రముఖ రచయిత అట్లూరి వెంకట రమణ, 53వ డివిజన్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, డాక్టర్ ప్రశాంతి, పారుపల్లి ఝాన్సీ, శ్రీదేవి, మల్లిక, రూప రుక్మిణి, భారతి, స్వామి విప్లవ్ , జెవివి రాష్ట్ర బాధ్యులు శివన్నారాయణ,, నాగేశ్వర్రావు, రాములమ్మ, జిల్లా సెక్రటరీ రామారావు, డాన్ బాస్కో, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.