Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
డబల్ ఇండ్లు మంజూరు కాక పెంకులూడుతున్న పెంకుటింట్లో జీనం సాగిస్తున్నామని మాణిక్యారం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో గురువారం మాణిక్యారం కోయగుంపులో ప్రజాజీవన శైలీపై సర్వేనిర్వహించారు. ఈసందర్బంగా గ్రామస్తులు పలు సమస్యలను ఐద్వా నేతల దృష్టికి తీసుకొచ్చారు. పేదల ఉపాధీ కోసం ప్రవేశ పెట్టిన ఉపాధీ హామీ పధకం లో తాము చేసిన పనికి కూలీ పడటం లేదని కూలీలు తెలిపారు. ఈ సందర్బంగా ఐద్వారా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ, మండల కార్యదర్శి కే.ఉమావతిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పధకాల ప్రకటన ఆర్భాటమే తప్ప వాటి అమలు ఊసు మరస్తుందన్నారు. పేదలందరికి డబల్ ఇండ్లు కట్టిస్తానన్నా కేసీఆర్ ప్రభుత్వం కూలుతున్న ఇండ్లలో నివాసం ఉంటున్న పట్టించుకోవటం లేదన్నారు. డ్వాక్రా మహిళలకు పావల వడ్డీని జమ చేయటం లేదని, అభయహస్తంలో దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ఐద్వా సర్వేలో వెల్లడైన సమస్యలపై అందోళన కార్యక్రమాలను రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు పాయం వరలక్ష్మి, కరపటి సీతమ్మ, మేకల స్పరాణి, వల్లపు వీరమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.