Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రం వద్ద రైతు సంఘం ధర్నా
నవతెలంగాణ- తల్లాడ
కటింగ్ లేకుండా ధాన్యాన్ని ఖరీదు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కుర్నవల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు తాత భాస్కరరావు మాట్లాడుతూ పదిహేను రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారుల నిర్లక్ష్య వైఖరి వహించడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయింది అని, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. అనంతరం సొసైటీ అధ్యక్షుడు ప్రదీప్రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, ఐలూరు రామిరెడ్డి, కట్టా దుర్గయ్య, గుర్రాల గోపాలకృష్ణారెడ్డి, దూల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.