Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాళ్లకు 10 కేజీల తరుగు తీస్తున్న మిల్లర్లు
- దిగుమతి మిల్లుల వద్ద జిల్లా అధికారులు,
- ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా ఉండాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ - వైరా టౌన్
యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా ఒక్క కేజీ కూడా మిల్లర్లు కటింగ్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు బాధ్యత తీసుకుంటామని బహిరంగ ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో మిల్లర్ల కటింగును అదుపు చేయడానికి ప్రయత్నాలు లేవు అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద రైతుల ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా మిల్లర్లు చేస్తున్న అక్రమ ధాన్యం కటింగును రైతులు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు వద్ద తేమశాతం పరిశీలించి అధికారులు దవీకరణ చేసిన తర్వాత రైతుకు ఎగుమతి దిగుమతితో సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ప్రకటించిన మిల్లర్లు మాత్రం క్వింటాళ్లకు 10 కేజీల కటింగుకు అంగీకరించిన రైతుల ధాన్యం మాత్రమే దిగుమతికి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మంత్రులు మూడు వేల కోట్ల రూపాయలు నష్టం భరించి యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రచారం చేసుకుంటు న్నారని, వాస్తవానికి నూకలు ఎక్కువ పేరుతో మిల్లర్లు కటింగ్ అదుపుతప్పి పోయిందని అన్నారు. జిల్లా మంత్రి, శాసనసభ్యులు కనీసం రెండు రోజులు మిల్లుల వద్ద కూర్చుని ధ్యానం దిగుమతి వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, వడ్లమూడి నాగేశ్వరరావు, చెరుకుమల్లి మోహనరావు, రామకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.