Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాస్క్ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
నవతెలంగాణ-వేంసూరు
మండలంలో గురువారం డివిజన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏవో రామ్మోహన్, ఎస్సై సురేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది దుకాణాలలో తనిఖీ చేసి నిల్వలు ఉన్న గోడౌన్లో రిజిస్టర్ను పరిశీలించారు. ప్రతి షాపులో నిల్వ, ధరల పట్టిక తో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి ఒక్కదానికి రసీదు ఇవ్వాలని, బిల్లు ఇవ్వని దుకాణాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీలలో హరి ప్రసాద్, ఎస్కే అక్బర్, వెంకటేశ్వర్లు, రాజుతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.