Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
ఏ కష్టమొచ్చినా... ఏ నష్టమొచ్చినా.. ఏ ఆపదొచ్చినా... ఆదుకుంటానని చెప్పే నాయకులను మాత్రమే మనం ఇప్పటి వరకు చూశాం... కానీ మన ఖమ్మంమాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటిని నిజం చేసి చూపించడంలో ముందుంటున్నారు. ఇప్పటికే కష్టాలు పడుతున్నా, ఆపదలో ఉన్నా అనేక కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. తాజాగా గురువారం ఉమ్మడిజిల్లా పర్యటనలో ఉన్న ఆయన చింతకాని మండలం నాగిలిగొండ నుంచి పెద్దమునగాల రోడ్డు మార్గంలో వెళ్తుండగా అదే సమయంలో ఆవులు అడ్డురాగా ద్విచక్రవాహనం మీద వెళ్తున్న ఓ కుటుంబం అదుపుతప్పి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన పొంగులేటి తన కాన్వారు ను ఆపి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించి వారికి మంచినీటిని అందించి హుటహుటిన తన కారులో ఖమ్మం నగరంలోని తన సొంత ఆసుపత్రి కిమ్స్‌లో చికిత్స ఇప్పించేందుకు చొరవ తీసుకున్నారు.