Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి జిఎంకు వినతి పత్రం
మణుగూరు : రేగల గండి గ్రామ సమస్యలు పరిష్కరించాలని మణుగూరు ఏరియా సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్‌కి సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రం గురువారం అందజేశారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కోడి శాల రాములు మాట్లాడుతూ పివి కాలనీకి కూతవేటు దూరంలో రేగుల గండి గ్రామం గత 30 సంవత్సరాల నుండి నివసిస్తున్నారు. వారికి సరైన రోడ్డు లేక అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని ప్రజలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఎవరైనా అనారోగ్యం పాలైన ఎప్పుడైనా గర్భిణీ స్త్రీలు రావాలన్న అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో సింగరేణి ఆధ్వర్యంలో లింగమంతుల జాతర సందర్భంగా పైపులు వేసి కొంతమేర మట్టి పోసి రోడ్డు ను తయారు చేశారు. కానీ అది కాస్త వర్షాలకి కొట్టుకుపోయి పైపులు తేలి రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. గతంలో సింగరేణి ఆధ్వర్యంలో రేగుల గండి గ్రామంలో సోలార్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. కానీ అది ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి పనిచేయటం లేదు. కావున సింగరేణి మణుగూరు జిఎం పరిశీలించి రోడ్డు మరమ్మతులు చేసి రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మణుగూరు మండల కార్యదర్శి కోడిశాల రాములు, గుండి భీమయ్య, కారం భీమయ్య, కుంజా వీరయ్య, గుండి కోటయ్య, మడకం దేవయ్య, గుండి రవి, గుండి నాగేశ్వరరావు, గుండి భద్రం కుంజా జగన్ తదితరులు పాల్గొన్నారు.