Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు
అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
అర్హులైన ప్రతిఒక్కరికీ రూ.5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే నిర్మించి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ములకలపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ రెండు పడక గదుల ఇండ్ల హామీని వెంటనే అమలు చేయాలని, దళిత గిరిజన నిరుపేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్లు వెంటనే ఇవ్వాలని, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే అరికట్టాలని తెలిపారు. పెరిగిన డీజిల్ పెట్రోల్ నిత్యవసర ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు అన్నవరపు సత్యనారాయణ, సంఘం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నిమ్మల మధు, వూకంటి రవికుమార్, గౌరి నాగేశ్వరరావు, బైరు ప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, పోడియం వెంకటేశ్వర్లు, దుబ్బా వెంకటేశ్వర్లు, కాకా అంజలి, కోండ్రు పాపమ్మ, ఒగ్గెల పరమమ్మ, పులి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.