Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచినీటి సౌకర్యం కల్పనలో జాప్యం....
- జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు పడక గదుల ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పనలో జరిగిన జాప్యంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ 5 డివిషన్ల డీఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ డిఆర్ఓకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో రెవెన్యూ, మిషన్ భగీరథ, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యం కల్పన, విద్యుత్ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 49 రెండు పడక గదుల ఇండ్ల కాలనీలకు మంచి నీటి సౌకర్యంకు నిధులు ఇచ్చినా ఎందుకు జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం నుండి మంచినీటి సమస్య ఉన్నదని వచ్చే గురువారం వరకు మంచినీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇళ్ళు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నిర్మాణం పూర్తి అయిన గృహాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని తహసీల్దార్ లను ఆదేశించారు. కేటాయించడానికి సిద్ధంగా ఉన్న సముదాయాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, పీఆర్ ఈఈ సుధాకర్, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు నియంత్రణకు చర్యలు : జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
బాల్య వివాహాలు బాలికల అభివృద్ధికి అవరోధాలని, నియంత్రణకు గ్రామ, మండల స్థాయిలో పటిష్ట పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో బాల్య వివాహాలు నియంత్రణ చర్యలపై మహిళా శిశ, సంక్షేమ, రెవిన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు చేస్తే పోలీస్ కేసులు నమోదు చేయాలన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే తక్షణమే సమాచారాన్ని 1098, 100 నంబర్ కు కాల్ చేసి చెప్పాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల సమాచారం గోప్యత పాటిస్తామని చెప్పారు. ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినోత్సవంలో బాల్య వివాహాలు నియంత్రణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఏఎస్పీ బిఆర్కె.ప్రసాదరావు, సిడిపివో షబాన, డిసిపిఓ హరి కుమారి, వివిధ మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.