Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-పాల్వంచ
మహమ్మారి కరోనా వ్యాధితో వందలాది మంది మరణిస్తున్న తరుణంలో ఆసుపత్రుల్లో చేరిన భాదితులకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవాలందించిన నర్సులు జీవనదాతలని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాల్వంచ పట్టణం పరిధిలోని శేఖరాంబజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆసుపత్రిలోని నర్సులకు, డాక్టర్లకు, సిబ్బందికి
వనమా శాలువా, బోకే, స్వీట్లతో సన్మానించారు. ఈ సందర్బంగా వనమా మాట్లాడుతూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలు చేస్తున్న నర్సులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, డాక్టర్ భుచ్చయ్య, డాక్టర్ స్వప్న, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, నవభారత్ ఆనంద్ పాల్గొన్నారు.