Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ అఖిల భారత పదకొండవ మహాసభలు ఈ నెల 12న ప్రారంభమై 15 వరకు పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరం ఎల్ పరగణాల జిల్లా సాల్ట్ లేక్‌లో జరగనున్నవి. ఈ మహాసభల సందర్భంగా మే 12 తారీఖున కలకత్తా నగరంలో భారీ యువజన ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ మహాసభకు ప్రతినిధిగా ఎన్నికైన జిల్లా కార్యదర్శి హరికృష్ణ ఈ బహిరంగ సభ జయప్రదంకి అన్ని రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో యువతీ యువకులు డీవైఎఫ్ఐ కార్యకర్తలు నాయకులు భారీగా తరలి వచ్చారని అందులో భాగంగా తెలంగాణా నుండి ఎంపిక అయిన 16 మంది ప్రతినిధులు పాల్గొన్నారని హరికృష్ణ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న యువజన వ్యతిరేక విధానాలపైనా ఉద్యమించేందుకు దేశ యువతరాన్ని సిద్ధం చేసేందుకు ఈ మహాసభలు ఉపయోగపడనున్నాయని అన్నారు.