Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరానికి చెందిన సాంకేతిక అధ్యాపకులు బాలినేని వెంకీనాయుడు శుక్రవారం ఎస్బిఐటి, ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల (ఆర్జేసి)కృష్ణను ఎస్బిఐటి కళాశాలలోని ఆయన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. డాటా సైన్స్ విభాగంలో ప్రత్యేక పరిశోధనకు గాను ఇనిస్టిట్యుట్ ఆఫ్ స్కాలర్స్ సంస్థ ద్వారా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ అవార్డు పొందిన వెంకీ సొంత పట్టణానికి విచ్చేసిన నేపథ్యంలో ప్రముఖ విద్యావేత్త కృష్ణను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.వెంకీ స్థానిక నెహ్రూ నగర్ ప్రాంతంలోని తన వెంకీ విజన్ సంస్థ ద్వారా పాఠశాలల, కళాశాలల విద్యార్ధులకు సాంకేతక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం వున్న కొత్త టెక్నాలజీ డాటా సైన్స్, ఆర్టిఫీషల్ ఇంటిల్‌జెన్సీ, మిషన్ లెర్నింగ్, రోబోటింక్ మీద ఎన్నో ప్రాజెక్ట్‌లు రూపొందించారు. ఫలితంగా ఆయనకు ఈ అవార్డు లభించింది. తమ కళాశాల విద్యార్థి అయిన వెంకీ అంతర్జాతీయ అవార్డు సాధించడం సంతోషంగా ఉందని ఆర్జేసీ కృష్ణ అన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ అధ్యాపకులు శెట్టి భాస్కర్, ఎస్బిఐటి కళాశాల ప్రిన్సిపల్ డా.జి.రాజ్‌కుమార్, అకడమిక్ డైరెక్టర్ జి.ప్రవీణ్ పాల్గొన్నారు.