Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీనిని ప్రభుత్వమే చూసుకుంటుంది
- నియోజకవర్గంలోని ధాన్యమంతా సత్తుపల్లి మిల్లులకే
కేటాయింపు
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
తరుగు పేరుతో 10 కిలోల వరకు కోత విధించి రైతులకు నష్టం కలిగించొద్దని, దీనిని ప్రభుత్వమే చూసుకుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైస్ మిల్లర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర పరిశీలించారు. ధాన్యాన్ని ఆడించే విషయంలో ఎంత వరకు నూకశాతం వస్తుందో దీనిని అధ్యయనం చేసేందుకు సంబంధిత పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుందన్నారు. నూకతో నష్టపోకుండా మిల్లర్లకు చెల్లింపులు ఉంటాయన్నారు. అంతేగాని మిల్లర్లు ఇష్టానుసారం తరుగును మినహాయిస్తే ఊరుకోమన్నారు. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలోని యాసంగి ధాన్యాన్నంతా సత్తుపల్లిలోని మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి మిల్లువద్ద వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందన్నారు. తరుగు తీస్తారనే భావనలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. యాసంగి పంటను కేంద్రప్రభుత్వం నిరాకరించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధపడిం దన్నారు. గత సీజనులో సేకరించిన ధాన్యాన్ని మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు తరలించ డంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిం చారన్నారు. దాని కారణంగా ప్రస్తుతం ధాన్యం సేకరణ ఆలస్యమవు తోందన్నారు. ఎఫ్‌సీఐ ఇలాంటి చర్యలను మానుకోవా లన్నారు. శనివారం పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులతో సమీక్ష జరుపనున్నా రన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి నియోజకవర్గంలోని ధాన్యం పంటనంతా సత్తుపల్లి మిల్లులకే కేటాయించాలని చేసిన విజ్ఞప్తి మేరకు కలెక్టర్ స్పందించారన్నారు. రైతులు ఈ విషయంలో ఆందోళన చెందవద్ద న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి, తుంబూరు పీఏసీఎస్ అధ్యక్షులు చల్లగుండ్ల కృష్ణయ్య, చిలుకుర్తి కృష్ణమూర్తి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, నాయకులు గాదె సత్యనారాయణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, దేవరపల్లి ప్రవీణ్‌కుమార్, అద్దంకి అనిల్‌కుమార్, దూదిపాల రాంబాబు, మల్లూరు అంకమరాజు, మేకల నరసింహారావు, మారుతి సూరిబాబు పాల్గొన్నారు.