Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులు అర్పించిన ప్రముఖులు
నవతెలంగాణ-ఇల్లందు
తెలంగాణా ఉద్యమ నేత వల్లిపి రెడ్డి రామస్వామి ఆలియాస్ మేధరి రామస్వామి (62) మృతి చెందారు. పట్టణంలోని 8వ వార్డులో సీతారామ టాకీస్ వెనుక వీధిలోని స్వగృహంలో నివాసం ఉంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్లు మృతుడు రామస్వామి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
వారి మరణం పట్ల విచారం వ్యక్తచేస్తూ రామ స్వామి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాధించాలని, ఆ భగవంతుడిని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమ నాయకులు లకావత్ దేవి లాల్ నాయక్, పార్టీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మేకల శ్యామ్, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, యూత్ జిల్లా ఇన్చార్జి ఎంటెక్ మహేందర్, రాశేఖర్, తదితరులు పాల్గొన్నారు.